Header Banner

హెచ్1బీ, ఎఫ్1 వీసాదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం!

  Mon Apr 07, 2025 12:06        U S A

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారులపై కఠిన వైఖరితో ఉన్న డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ, ఎఫ్1 వీసాలు కలిగినవారు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ఇంతవరకు సహాయంగా ఉన్న హెల్ప్ డెస్క్‌ను సస్పెండ్ చేయాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (CIS) అంబుడ్స్‌మన్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని 60 రోజుల పరిపాలనా సెలవుపై పంపుతూ ఆదేశాలు ఇచ్చారు. ఇది స్వతంత్ర ఇమ్మిగ్రేషన్ పర్యవేక్షణ సంస్థను మూసివేసే మొదటి దశగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య వలన వీసా ప్రాసెసింగ్‌ జాప్యాలపై సాయం పొందే మార్గం పూర్తిగా మూసుకుపోతుంది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వలసదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది, ముఖ్యంగా భారతీయులపై. ఇప్పటివరకు వీసా, గ్రీన్ కార్డు విషయాల్లో ఏటా సుమారు 30,000 మంది ఈ హెల్ప్ డెస్క్ సేవలు పొందుతూ వచ్చారు. తాజా నిర్ణయంతో ఆలస్యమైన లేదా వివాదాస్పదమైన USCIS కేసులకు సంబంధించి సహాయం కోసం ఇక కాంగ్రెస్ ప్రతినిధులను లేదా ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులను సంప్రదించాల్సి ఉంటుంది. తమ వీసా ప్రక్రియలను వేగవంతం చేసుకోవడానికి ప్రీమియం ప్రాసెసింగ్ వంటివి ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు తమ హెచ్1బీ ఉద్యోగుల ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించడం గమనార్హం.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలుఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #H1BVisa #F1Visa #GreenCardIssues #ImmigrationCrisis #TrumpImmigrationPolicy #CISShutdown #USImmigrationHelp #VisaSupportNeeded